తెరపైకి మళ్లీ పాత పంచాయతీ!

తెలుగు రాష్ట్రాల మద్య పాత పంచాయితీ  మళ్లీ కొత్తగా మొదలైంది. పోలవరం ఎత్తు  అంశాన్నిమళ్ళి తెరమీదకి తీసుకు వచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఇటీవలి గోదావరి  వరదలతో ఈ చర్ఛ పోలవరంపై చర్చ మళ్ళి మొదలైంది. పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముంపు ముప్పు పెరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అయితే మంత్రి పువ్వాడ వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి ఖండించారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్న అంబటి రాంబాబు  వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరి కాదన్నారు ఆయనకు హితవు పలికారు.  పోలవరం  గేట్లు   ఎత్తడంలో జాప్యం  వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని విమర్శించిన పువ్వాడ, గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా ఇదే పరిస్ధితి పునరావృతమౌతుందనీ అందుకే పోవలరం ఎత్తు తగ్గించాలన్నదే తమ డిమాండ్ అని పునరుద్ఘాటించారు పోలవరం స్పిల్ వెల్ 50,000 క్యుసేక్కులకి పెంచారు .ప్రాజెక్ట్ లో గరిష్టం గా 15 రోజులు నీటి మట్టం నిలవ ఉండే అవకాశం ఉంది. అందు వల్ల భద్రాచలాని కి ఎలాంటి ముప్పు ఉండదు. భద్రాచలం లో 80 అడుగుల కరకట్ట నిర్మాణం జరిగింది.

పోలవరం తో సంభందం లేకుండా ప్రస్తుతం 50నుంచి60 అడుగుల నీటిమట్టం నమోదు అవుతోంది. పోలవరం నుంచి వచ్చే నీటి మట్టం 43 అడుగులని దాని వల్ల భద్రాచలానికి ఎటువంటి ముప్పు  ఉండదన్నది ఏపీ వాదన. పనిలో పనిగా పువ్వాడ కొత్త డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. భద్రాచలాన్ని ఆనుకుని  ఉన్న ఐదు గ్రామాలనూ తిరిగి తెలంగాణలో కలిపేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.  

ఎటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపాలని, వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాలలో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ చేశారాయన. రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాల అంశాన్ని తెరమీదకు తేవడం పరిపాటిగా మారిందని ఏపీ విమర్శిస్తోంది.

పోలవరం కారణంగా భద్రాచలంకు ముప్పు ఏర్పడుతుందన్న వాదనకు ఎలాంటి హేతుబద్ధత, శాస్త్రీయత లేదని చెబుతోంది. గతంలో కూడా గోదావరికి భారీ వరదలు వచ్చాయని,కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,కేంద్రం నిధులు సమకూరుస్తోందని,ఏదైనా కేంద్రం చేతిలోనే ఉందని ఏపీ చెబుతున్నది. రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చే ఇటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమజంసం కాదని అంటోది.