జుడా గ్రేస్ జననం.. యాదృచ్ఛికం!
posted on Jul 19, 2022 3:20PM
అద్భుతాలన్నీ ఆశ్చర్యపరుస్తాయి. వాటిలో కొన్ని యాదృచ్ఛికం. ఊహకే అందని విధంగా జరిగిపోతుం టాయి. అలాంటిదే అమెరికా అల్మాన్స్ రీజియనల్ మెడకల్ సెంటర్‌లో. ఇక్కడ అబెర్లీ అనే మహిళకు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాన్నం సరిగ్గా 2.22 నిమిషాలకు బిడ్డ పుట్టింది. అదీ చాలా విచిత్రంగా ఆస్పత్రి రెండవ వార్డులో! ఉత్తర కరోలినా కుటుంబం ఆనందానికి అంతేలేదు. అక్కడి వారంతా ఇంకా గ్రేస్ జననం గురించి చెప్పుకుంటున్నారు.. కథలు కథలుగా.
ఉత్తర కరోలినా వాసులు, ముఖ్యంగా జూడా ఇంటి పరిసరాలవారంతా ఆశ్చర్యపడుతున్నది ఆ బిడ్డ తల్లి అబెర్లీకి కేన్సర్. ఆమె చికిత్స పొందుతోంది. అయినా గర్భందాల్చడం బిడ్డ పుట్టడం వారెవరూ ఊహిం చనే లేదని అంటున్నారు.
ఆ ఆస్పత్రి వర్గాలు తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నారు. ఎందుకంటే, ఇన్ఫె క్షన్ తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిరోధించే శోషరస వ్యవస్థ అబెర్లీలో ఉండటం విశేషమట. పైగా ఇలా చిత్రంగా అన్నీ రెండు అంకెలు కలిసే రోజున జన్మించడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు ఆస్పత్రి సీనియర్ డాక్టర్లు.
వారేకాదు అబెర్లీ పక్కింటి బామ్మగారూ అదే మాట అంటున్నారు. ఆ అమ్మాయి ప్రార్ధనలు భగ వంతుడు విన్నాడు. అందుకే చరిత్ర సృష్టించింది ఆ బంగారు తల్లి అని నవ్వుతూ అందరికీ చెబుతోం దామె. ఇలా జరగడం చాలా అరుదు అని వారి సంబంధిత చర్చ్ ఫాదర్ కూడా ఆశీర్వదించి వెళ్లారుట. మరి ఇలాంటి జననాలు మీ పరిసరాల్లో జరిగాయేమో గుర్తు తెచ్చుకోండి.