ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు
posted on Nov 18, 2015 9:16AM
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఐసిస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ఫ్రాన్స్ పౌరులైతే ఏ చిన్న ఘటన జరిగినా ఉలిక్కిపడుతున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్‌కి చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం నాడు ఎయిర్ ఫ్రాన్స్ విమానం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి ఫ్రాన్స్‌కి వెళ్ళాల్సి వుండగా ఆ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనిఖీలు నిర్వహించిన అనంతరం విమానంలో బాంబు లేదని నిర్ధారించిన అధికారులు సాల్ట్ లేక్ మీదుగా విమానాన్ని నడిపించారు. అలాగే వాషింగ్టన్ నుంచి ప్యారిస్ వెళ్ళాల్సిన మరో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. అధికారులు ఆ విమానాన్ని కూడా తనిఖీ చేసి బాంబు లేదని ధ్రువపరిచాక విమానం ప్రయాణించింది. రెండు విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్‌కి చేరుకున్నాయి.