ప్రధాని కూతురికి సమన్లు జారీ....
posted on Jun 27, 2017 4:58PM

పనామా పత్రాలపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబం గత కొద్దిరోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కేసులో నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ కు సమన్లు అందాయి. జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరియం నవాజ్ కు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం జులై 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం మరియం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ కూడా జూలై 3, 4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పెద్ద కుమారుడైన హసన్‌ను ఇప్పటికే ఐదు సార్లు జేఐటీ విచారించింది. కాగా మనీలాండరింగ్ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ నగరం పార్క్‌లేన్ ఏరియాలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.