పక్కా ప్లాన్ ప్రకారమే ఎస్సై దగ్గరకు శిరీష...

 

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకొని మరణించిన రోజు నుండి.. ఈరోజు వరకూ ఏదో ఒక కొత్త విషయం వెలుగుచూస్తూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న శ్రావణ్, రాజీవ్ లను పోలీసులు రెండు రోజులుగా విడివిడిగా విచారణ జరుపుతూనే ఉన్నారు. అయితే ఈ విచారణలో శ్రావణ్, శిరీషను పక్కా ప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లానని చెప్పినట్టు తెలుస్తోంది. రెండోసారి పోలీసులు శ్రవణ్ ను విచారించగా...తన ఫ్రెండ్‌ శిరీష, ఆమె స్నేహితుడు రాజీవ్‌ మధ్య విభేదాలు పెరిగిపోయాయని, వారిద్దరినీ అక్కడికి తీసుకొస్తానని, ఈ సమస్యను పరిష్కరించాల్సింది మీరేనని తాను ప్రభాకర్ రెడ్డిని కోరినట్టు చెప్పాడు. అంతేకాదు  శిరీషను ఉపయోగించుకుంటే మనకే లాభమని ఎస్సైకు శ్రవణ్ చెప్పినట్టు...  ఈ వ్యవహారం రాజీవ్ కు తెలియకుండా చూసుకుందామని కూడా అన్నాడని తెలుస్తోంది. శిరీషకు ఉద్దేశపూర్వకంగానే మద్యం ఎక్కువ పోసినట్టు కూడా తెలిపాడు. తొలిసారి ముగ్గురూ సిగిరెట్ తాగేందుకు వెళ్లగా, రెండోసారి కేవలం రాజీవ్ ను మాత్రమే సిగిరెట్ పేరుతో బయటకు తీసుకొచ్చాడని... దీంతో ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడంతో శిరీష అరిచి గోల చేసిందని.. దాంతో తనను అదుపు చేయడానికి రాజీవ్ శిరీషను కొట్టాడని శ్రవణ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu