ఓయూ బీఫ్ ఫెస్టివల్.. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం..

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఓయూ విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో గోసంరక్షణ సమితి.. భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సుమారు  రెండువేల మంది గోసంరక్షణ కార్యకర్తలు ఓయూ ఎదుట భైటాయించారు. ఈ సందర్భంగా వారు యూనివర్శిటిలోకి ప్రవేశించాలని చూడగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. టీజీవీపీ నేత శ్రీహరి సహా 25 మంది ఏబీవీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఓయూ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. కాగా ఓయూ హాస్టళ్లల్లో పోలీసులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు బీఫ్ ఫెస్టివల్.. పోర్కు ఫెస్టివల్ కు మద్దతివ్వమని గోషమహన్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన చేపట్టగా ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను షాహినాయత్ గంజ్ పీఎస్ కు తరలించారు. దీంతో రాజాసింగ్ ను వెంటనే విడిచిపెట్టాలని ఆయన కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.