జైలు కూడా జ‌గ‌న్ ని మార్చ‌లేక‌పోయింది

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఏపీ మంత్రి క‌ళా వెంక‌ట్రావు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ జైలు జీవితం గ‌డిపినప్ప‌టికీ జ‌గ‌న్ జీవితంలో ఎలాంటి మార్పు రాలేద‌ని అలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల‌కు అన‌ర్హుడ‌ని అన్నారు. నాడు త‌న తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ల‌క్ష కోట్లు దోచుకున్న జ‌గ‌న్ చేతికి అధికారం అందితే మ‌రింత అవినీతికి పాల్ప‌డ‌తాడ‌ని ఆరోపించారు. ఆయ‌న ఎప్ప‌టికీ నాయ‌కుడు కాలేడ‌ని..అందుకు కార‌ణం జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌, మాట‌తీరు, ఆయ‌న చేసే ప‌నులే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. నంద్యాలలో టీడీపీ గెల‌వ‌డానికి ప్ర‌త్యేక‌మైన వ్యూహాలు ఏమి అవ‌స‌రం లేవ‌ని జ‌గ‌న్ వ‌ల్లే వైసీపీ ఓట‌మి పాల‌వుతుంద‌ని జోస్యం చెప్పారు.  ఆ పార్టీ పెద్ద‌లు, కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ ని అస‌హ్యించుకునే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.