నమితకు కొత్త షేపులు
posted on Nov 7, 2012 2:20PM
మొదటి సినిమాలో చాలా స్లిమ్ గా కనిపించిన నమిత తర్వాత్తర్వాత తమిళ ఇండస్ట్రీకెళ్లి తెగ ఊరిపోయింది. ఏదైనా బాగా ఎక్కువగా ఉంటేనే ఇష్టపడే తమిళజనంకోసం బాడీని తెగపెంచేసిన ఈ ముద్దుగుమ్మ బొద్దుగా తయారయ్యాక తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పుష్కలంగా సంపాదించుకుంది.
నమిత అందాన్ని చూసి ఫ్లాటైన ఓ జపాన్ టీవీ ఛానెల్ ఆమెని ప్రత్యేకంగా తమ దేశానికి పిలింపించుకుని ఘన సన్మానం చేసి తరించింది. ఫోటో గ్రాఫర్ కార్తీక్ శ్రీనివాసన్ తీసిన ఓ ఫోటో ఆ ఛానెల్ కి పిచ్చపిచ్చగా నచ్చిందట. విదేశాల్లోకూడా తన ఫిగర్ కున్న ఫాలోయింగ్ ని చూసి ఖంగుతిన్న నమిత అయ్యయ్యో బాడీని తెగ పెంచేసి అనవసరంగా డీ గ్లామరైజ్ అవుతున్నానేమో అన్న ఆలోచనలో పడింది.
అనుకున్నదే తడవుగా ఓ పర్సనల్ ట్రైనర్ ని ఏర్పాటుచేసుకున్న నమిత రోజూ కఠినమైన వర్కవుట్లు, స్ట్రిక్ట్ డైట్ చార్ట్ తో తన షేపుల్ని పూర్తిగా మార్చేసుకుంటోంది. యుద్ధప్రాతిపదికమీద స్లిమ్ గా తయారవ్వాలన్న తపన నమితలో బాగా కనిపిస్తోందని ట్రైనర్ కూడా చెబుతున్నారు. స్లిమ్ గా తయారైతే తెలుగులో మరో స్ట్రైట్ హిట్ కొట్టొచ్చన్నది ఈ అందాల సుందరి ఆలోచనని ఇండస్ట్రీవర్గాలు అనుకుంటున్నాయ్.