ఎంపీలకు జీతాల పెంపు అవసరమా!
posted on Jul 3, 2015 12:37PM
ఒక సామాన్య మానవుడు తనకు వచ్చే జీత భత్యాలు మీద ఆధారపడి బ్రతకడం ఎంతో కష్టమో అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తోంది. కానీ కోట్లుకు కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు కూడా తమ జీత భత్యాలు పెంచమని అడగటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు పెంచమని, మాజీ ఎంపీల పెన్షన్ లను పెంచమని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. అయితే ఒక పార్లమెంట్ సభ్యుడి జీత భత్యాలు ఎంత.. అతనికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా అనే విషయం పై ఒక లుక్కేద్దాం.
* ఒక పార్లమెంట్ సభ్యుడి జీతం.. 1,20,000
* నెలకు రాజ్యాంగ వ్యయం.. 10,000
* ఆఫీస్ నిర్మాణానికి అయ్యే ఖర్చు.. 14, 000
* ప్రయాణఖర్చులు (Rs. 8 కి.మీ).. 48,000
* పార్లమెంట్ మీటింగ్స్ (రోజుకి).. 500
* రైలు ప్రయాణం ఫస్ట్ క్లాస్ ఏసీ.. ఉచితం
* సంవత్సరానికి 40 సార్లు ఉచిత విమాన ప్రయాణం
* ఒకవేళ ఢిల్లీలోని ఎంపీ హోటల్ బస చేయాల్సి వస్తే రెంట్ ఉచితం
* 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (ఇంటికి)
* 1,70,000 ఫ్రీ ఫోన్ కాల్స్
* మొత్తానికి సంవత్సరానికి ఒక ఎంపీకి ప్రభుత్వం చేసే ఖర్చు.. 33,08,000
* 5 సంవత్సరాల పదవికాలంలో అయ్యే ఖర్చు.. 1,60,00,000
అంటే ఒక ఎంపీకి 5 సంవత్సరాలో 1,60,00,000 ఖర్చు అయితే.. మొత్తం 534 ఎంపీలకు ఒక సంవత్సరం కాలంలో అయ్యే ఖర్చు 8,54,40,00,000 అంటే సుమారు 855 కోట్లన్నమాట.
అదీ చాలదన్నట్టు పార్లమెంట్ సభ్యులకు అందించే భోజన సదుపాయాలు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. కనీసం బయట పేదవాడికి కూడా అంత చీప్ గా ఎక్కడా దొరకవేమో.. పేద వాడికి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం చేతకాని రాజకీయనేతలు మాత్రం పార్లమెంట్ సభ్యులకు మాత్రం అంత చౌక ధరలకే తిండి పెట్టడం ఎంత మాత్రం కరెక్టో ఆలోచించుకుంటే మంచిది. ఆ లిస్టు కూడా ఒకసారి చూద్దాం.
మళ్లీ క్యాంటీన్ లో అందించే భోజనం సరిగా లేదంటూ తమ ఆరోగ్యం చెడిపోతుందంటూ ఫిర్యాదులు కూడా చేశారంట మన ఎంపీలు. ఎంతైనా ఫ్రీగా వచ్చే ఫుడ్డు కదా పాపం మన ఎంపీలకు సరిగా అరగలేదేమో అందుకే ఆరోగ్యం చెడిపోయివుంటుంది.
దీనిని బట్టి ఒక ఎంపీకి ఇంకా జీత భత్యాలు పెంచడం అవసరమా? వారికి పెట్టే ఖర్చులో కనీసం కొంతైనా పేదలకు ఖర్చు చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడిఉండేది.