అంగరంగ వైభవంగా మంచు మనోజ్ పెళ్లి

 

మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఆఖరికి ఓ ఇంటివాడయ్యాడు. ఎప్పటినుండో పెళ్లి ఏర్పాట్లతో మంచువారింట పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మాదాపూర్ లోని హైటెక్స్ లో ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మంచు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ప్రముఖ రాజకీయనేతలు, తెలుగు తమిళ, హిందీ పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సోదరి మంచు లక్ష్మీ ఈ పెళ్లి తంతు మొత్తం దగ్గరుండి మరీ చూసుకున్నారు.