ఒంటరితనం.. ఫలితం ఆన్‌లైన్ ఆత్మహత్య...
posted on Dec 1, 2014 9:48PM
చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్రంలో జెంగ్ అనే యువకుడు అందరూ చూస్తుండగా ఆన్‌లైన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను ఒక సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అప్పటికే అతను చనిపోయి పడి వున్నాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు జెంగ్ తనను ఒంటరితనం ఆవరించిందని, నిరాశగా ఉందని మైక్రోబ్లాగులు పెట్టాడు. తాను ఈ మాయా ప్రపంచాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నానని, తనను బతకాలంటూ ఎవరూ ఒత్తిడి చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకోవడం కోసం రకరకాల విషాలు, టేపులు, బొగ్గు తెచ్చుకున్నాడు. ఆ విషాలు మింగి, బొగ్గు అంటించుకుని చనిపోయాడు. తాను మింగిన విషాలు ప్రభావం చూపడం మొదలు పెట్టాయని, ఓపిక నశిస్తోందని కూడా బ్లాగులో రాశాడు. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో వున్న చాలామంది జెంగ్ను ఆపేందుకు ప్రయత్నించినా నో యూజ్.. అతను చనిపోయాడు..