ఎన్నిసార్లు తల నరుక్కుంటావ్ కేసీఆర్?

 

ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమం సమయంలో తాను ఇచ్చిన అనేక హామీలలో ఒక్కదాన్ని కూడా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ విమర్శించారు. తెలంగాణకు దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, లేకపోతే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ తాను చెప్పిన మాటను తప్పారని దామోదర అన్నారు. కేసీఆర్... నువ్వు ఇలా ఎన్నిసార్లు తల నరుక్కుంటావ్ అని ఆయన కేసీఆర్ని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి హామీల మీద హామీలు ఇస్తున్నారే తప్ప ఒక్కదాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదని దామోదర రాజనర్సింహ విమర్శించారు.