అమెరికా అద్యక్ష ఎన్నికలు.. గెలుపోటములను ప్రభావితం చేసే కీలక అంశాలు!

అమెరికా ఎన్నికల్లో ఇంటర్నల్ ఎక్స్‌టర్నల్ ఏజెన్నీల పాత్ర చాలా లోతుగా వుంటుంది ఇంటర్నల్ గా ఎఫ్బీఐ ఎక్స్టర్నల్ గా యూఎస్ సీఐఏ, యూకే ఎమ్ఐ6, కెనడా ఆర్సీఎంపీ,  ఆస్ట్రేలియ ఏఎస్ఐఎస్,  న్యూజిల్యాండ్ ఎజెన్సీ ఎన్ జడ్ఎస్ఐఎస్.   ఈ ఐదింటినీ  ఫైవ్ ఐస్  అని పిలుస్తారు.  అయితే వీటన్నిటికీ మించి ఇజ్రాయెల్ కు చెందిన ప్రపంచ టాప్ మెస్ట్ సీక్రేట్ సర్వీస్ ఏజెన్సీ మొసాద్లే  మోడియన్ ఉలే తఫ్కిడిమ్ మేయుహదిమ్. వీటి ప్రమేయం లేకుండా  అమెరికా ఎన్నికలు జరగవు.  అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేలా అనేక  కుట్రలు, కుతంత్రాలు. పన్నాగాలు ,  అమానవీయ కార్యక్రమాలకు ఈ ఏజెన్సీలు ఏ మాత్రం వెనుకాడవు.  

గతంలో వీరి చెప్పు చేతల్లో లేని రాబర్ట్ ఎఫ్ కెనడీ బాబీ కెనడి మేల్ కమ్ఎక్స్  మార్టిన్ లూథర్ కింగ్ ను అంతం చేసింది కూడా ఈ ఏజన్సీలే!  గత ఎన్నికల్లో జరిగిన అనేక అక్రమాలకు మించిన దారుణాలు ఈ ఎన్నికల సందర్బంగా జరుగుతున్నాయి. బైడెన్ ప్రభుత్వం ఇల్లీగల్ మైగ్రెంట్స్ ను దేశంలోకి అక్రమంగా అనుమతి ఇస్తొంది. టెక్సాస్, మెక్సికో  సరిహద్దులు అనధికారికంగా తెరుచుకున్నాయి అమెరికాకు అక్రమంగా వచ్చే వలసల్లో లాటిన్స్,  చైనీస్, ఇండియన్స్ అధికంగా వున్నారు భారతీయులలో  అత్యధికంగా  గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లు ఉన్నారు.   అక్రమంగా దేశంలోకి చొరబడిన వ్యక్తులను రిపబ్లిక్ పార్టి బలంగా వున్న రాష్ట్రాలకు పంపించి అక్కడ వీరిని ఓటర్లుగా నమోదు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో  సరైన దృవపత్రాలు లేకుండా కూడా ఓటింగ్ కు అనుమతిస్తున్నారు.  ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితి దిగజారడం,  నిరుద్యోగం, ఐటీ మాంద్యం వంటి అనేక కారణాల వల్ల    డెమోక్రాట్స్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుక్కుంటున్నారు!

కరోనా లాక్ డౌన్ తరువాత వ్యాక్సిన్ పై వ్యతిరేక వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఆ పోస్టులను ఏజెన్సీలు చాలా వరకూ కంట్రోల్ చేశాయి. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ దాడులు యుక్రెయిన్ వార్తలను ఏజెన్సీలు ఎంత కంట్రోల్ చేద్దాం అన్నా సాధ్యపడక పోవడం,  నాటి ట్విట్టర్  నేటి ఎక్స్ యజమాని ఎలెన్ మాస్క్ న్యూట్రల్ మీడియాకు యాక్సెస్ ఇవ్వటం రిపబ్లికన్లకు నిస్సందేహంగా కలిసి వచ్చే అంశం.  2020 అమెరికా ఎన్నికలకు కోవిడ్ వైరస్ కు లింక్ వుంది అనే ప్రచారం వుంది ! ఆ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ రిగ్గింగ్ కు పాల్పడ్డారు అన్న ఆరోపణలు వున్నాయి. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు.  ట్రంప్ మద్దతుదారులు  అమెరికన్ పార్లమెంట్ పై డాడి చేయడం వెనుక ఎఫ్ బీఐ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.   ట్రంప్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో   ఆ అల్లర్ల వెనుక ఉన్నది ఎఫ్బీఐ అన్న వార్తలు వచ్చాయి.    సెనెట్ కమిటి మీటింగ్ లో ఈ విషయమై ఎఫ్బీ ఐ డైరెక్టర్ వివరణ ఇస్తూ ఐకాంట్ రివీల్ (నేను బయటపెట్టలేను) అన్నారు. 

ఈ ఎన్నికల ప్రచారంలో  ట్రంప్ పై  రెండు హాత్య ప్రయత్నాలు జరిగాయి.  ట్రంప్ మునుపటి ట్రంప్ కాదు ఆయనలో చాలా మార్పు వచ్చింది అనేది కొంత మంది వాదన.  ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న వ్యక్తి జేడీవేన్స్. ఇతను ఎవరో కాదు..  2016 ఎన్నికలలో  ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి.   వేన్స్ కు మీడియా అధినేతలతోనూ,  సీఐఏ,  మొసాద్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈయన భార్య ఉషా చిలుకూరి మన తెలుగు అడపడుచు.  కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రీ మనవరాలే ఉషా చిలుకూరి.  ట్రంప్ ఎన్నికల ప్రచారంలో లోకల్ ఎంప్లాయిమెంట్, ట్రేడ్ టారీఫ్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ పన్ను విధానం సమీక్ష వుంటుంది అంటున్నారు.  ట్రంప్ అల్లుడు జ్యుయిష్ కావడం విశేషం! అమెరికా ఎన్నికల్లో డీప్ స్టేట్ వ్యవహారాల పాత్ర చాలా ఎక్కువ మిలటరీ ఇండ్రస్టీయల్ కాంప్లెక్స్ తో పాటు మనం ముందు చెప్పుకున్న ' ఫైవ్ ఐస్,  మెసాద్ పాత్ర అత్యంత కీలకం! ఇరాన్, సిరియా, లెబనాన్, సోమాలియా, పాలస్తీనా, యుక్రెయిన్ , జార్జియా, హైతీ, యెమెన్, బంగ్లాదేశ్, జోర్డాన్ లో సీక్రెట్ ఏజెన్సీల కుట్రలు అనేకం!

ట్రంప్ అధికారంలోకి వస్తే యుక్రెయిన్ కు ఆయుధాలు నగదు రూపంలో డాలర్ల పంపిణి ఆగిపోవచ్చు అనే అనుమానం ఏజెన్సీలలో వుంది అమెరికా పంపే ఆయుధాల్లో కొంత భాగం బ్లాక్ మార్కెట్ ద్వారా సిరియాలోని ఐసిస్ కు చేరుతాయి! ఐసిస్ ను క్రియేట్ చేసింది ఎవరో తెలుసా ఒమాబా! సిరియా ప్రధాని అసాద్ ను దించటమే ఒబామా లక్ష్యం సిరియా ప్రధాని అసాద్ కు రష్య అండగా వుండటమే అసలు కారణం! సిరియాలో రష్య బేస్ వుంది ! బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ యుక్రెయిన్ కుంభకోణంలో భాగస్వామి! అమెరికా ఎన్నికల సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే డెమొక్రాట్లకు నష్టం కలగచ్చు అని భావించి ఇజ్రాయెల్ ను అమెరికా వారించినా వినడం లేదని భావించి ఇజ్రాయెల్ చేయబోయే దాడి వివరాల డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఒక పక్క ఇజ్రాయెల్ ను అమెరికా వారిస్తుంటే మరో పక్క  ఇరాన్ ను రష్యా కంట్రోల్ చేస్తుంది. ఒక వేళ ఇరాన్ పై ఇజ్రాయెల్‌ నూక్లియర్ ఆయుధ దాడి చేస్తే పాకిస్తాన్ రంగంలోకి  దిగుతుంది అని ప్రకటించింది. ఇజ్రాయెల్ తో పాటు మొత్తం యూరప్ నూక్లియర్ వెపన్స్ తో లేపేస్తాం అని ప్రకటించింది! అమెరికా ఎన్నికలు అనేక సంక్లిష్ణ ప్రపంచ యుద్ధ నేరాలు ఘోరాలతో ముడిపడి ఉన్నాయి ! డెమొక్రాట్స్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తమిళనాడు కమలాపురంకు చెందిన శ్యామలా గోపాలన్ కుమార్తె.  ఈమె తాత ముత్తాతలు అగ్రహార బ్రాహ్మణ కులానికి చెందినవారు. కమాలా హరిస్ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారు. ఆమె భారత సంతతికి చెందిన మహిళ.  ఒక వేళ ట్రంప్ గెలిస్తే ఉపాధ్యక్షురాలిగా జేడీ వేన్స్ అవుతారు. ఆయన సతీమణి  ఉషా చిలుకూరి కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే.  అదుర్స్ సినిమాలో బట్టు అన్నట్లు  వాళ్ళుకూడా మన మనవారేనా.. ఏం కిక్కిచ్చావురా చారీ అంటాడు. అలా కమలా హారిస్, డోనాల్డ్ ట్రంప్ లలో ఎవరు గెలిచినా   వారికి మన దేశం పెద్ద మార్కెట్టు వారి వస్తువులను మనకు అమ్మడం కోసం మనతో సన్నిహిత సంబంధాల నాటకం ఆడుతునే వుంటారు.  ఈ నెల ఐదున ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది జనవరి 20 న కొత్త అధ్యక్షుని ప్రమాణకాస్వీకారం వుంటుంది  ఒక వేళ ట్రంప్ గెలిస్తే  జనవరి 20 లోపు ఏమైనా జరగొచ్చు దానిని డీప్ స్టేట్ పాలిటిక్స్ అంటారు.