ఇలాంటి దారుణాలూ జరుగుతాయ్...

 

మానవ సంబంధాలలో రకరకాల వింతలు ఒక్కోసారి బయటపడి భయం కలిగిస్తూ వుంటాయి. అలాంటి భయం కలిగించే ఘటన ఇటీవల కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని మాండ్యా జిల్లాలోని హాలహళ్ళికి చెందిన దివ్యశ్రీ, అనూష అనే ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ ఫ్రెండ్స్. దివ్యశ్రీ ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేసి, సొంత ఊళ్ళోనే బి.ఇడి. చదువుతోంది. అనూష ఆ ఊళ్ళోనే ఒక మొబైల్ షాపు నిర్వహిస్తోంది. ఇదిలా వుంటే, దివ్యశ్రీకి ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్ళి జరిగింది. దివ్యశ్రీకి అప్పుడే పెళ్ళేంటని అనూష దివ్యశ్రీ తల్లిదండ్రుల దగ్గర వాదించింది. అయితే వాళ్ళు అనూష మాటలను పట్టించుకోకుండా దివ్యశ్రీకి పెళ్ళి చేసి కాపురానికి బెంగుళూరుకు పంపించేశారు. మొన్నీమధ్య ఉగాది పండుగ సందర్భంగా దివ్యశ్రీ సొంత ఊరికి వచ్చింది. అయితే వచ్చిన రెండోరోజే ఆమె దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహం సమీపంలోని పంటపొలాల్లో పడి వుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు షాకయ్యే విషయాలను బయటపెట్టారు. పోలీసుల పరిశోధనలో బయటపడిన ఫొటోలో దివ్యశ్రీ, అనూష పోజులు చూసి జనం నివ్వెరపోయారు. పోలీసులు అనూషని అరెస్టు చేసి అసలు విషయం వెల్లడించారు. దివ్యశ్రీని అనూషే చంపేసింది. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన దివ్యశ్రీ - అనూష మధ్య స్నేహం సరిహద్దులు దాటిపోయి శారీరక సంబంధం వరకూ వెళ్ళిపోయింది. తనకు పార్టనర్‌గా వున్న దివ్యశ్రీకి పెళ్ళికావడం ఇష్టంలేక అనూష పెళ్ళిని ఆపడానికి ప్రయత్నించింది. పెళ్ళి చేసుకున్న దివ్యశ్రీ ఉగాది పండక్కి పుట్టింటికి వచ్చినప్పుడు అనూష దివ్యశ్రీని తనతో శారీరక సంబంధం కొనసాగించాలని డిమాండ్ చేసింది. అయితే దివ్యశ్రీ అందుకు నిరాకరించింది. దాంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్న అనూష ఆమెని నమ్మించి ఊరి చివరికి తీసుకెళ్ళి గొంతుకు నైలాన్ వైర్ బిగించి చంపేసింది.