పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం...

 

చిత్తూరుజిల్లా సత్యవేడులోని శ్రీసిటీసెజ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెప్సికో యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి ఏపీ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా శ్రీసిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సముద్ర తీరం ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు.