కాకినాడ టీడీపీ ఎంపీ... డెబిట్ కార్డ్ క్లోనింగ్
posted on Oct 3, 2015 12:52PM
టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా నేరగాళ్లు మాత్రం వాటిని కూడా అధిగమించి తమ చేతివాటం చూపుతున్నారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు క్లోనింగ్ తో ఏటీఎమ్స్ నుంచి మనీ దోచేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నా... వాటిని అరికట్టడంలో అటు బ్యాంకులు కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ కానీ సక్సెస్ కాలేకపోతున్నాయ్, ఇప్పుడు తాజాగా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నర్సింహం హైటెక్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు, ఆయన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన దుండగులు... తోట నర్సింహ ఖాతా నుంచి 50వేల రూపాయలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. గోవాలోని ఓ ఏటీఎం నుంచి ఈ డబ్బు తీసినట్లు తెలుసుకున్న కాకినాడ ఎంపీ... పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తు ప్రారంభించారు.