కడియం, తలసానికి దడ

 

టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన తలసాని, ఎంపీగా వుండి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టిన కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేయడానికి బయపడుతున్నారని, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పాల్గొనాలంటే వాళ్ళకి దడ పుడుతోందని టీటీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన పక్షంలో టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదని ఆయన అన్నారు.