జగన్ వస్తే చచ్చిపోతాం...

 

జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా.. చంద్రబాబు మొక్కవోని దీక్షతో సమస్యలను అధిగమిస్తున్నారని అన్నారు.  పైసా నిధులు లేకపోయినా..రాష్ట్రంలో ఎక్కడా పనులు ఆగడం లేదని, ఎన్టీఆర్ కలని చంద్రబాబు సాకారం చేస్తున్నారని వెల్లడించారు. బాబు మళ్లీ సీఎం అయితే తప్ప మనకు భవిష్యత్ ఉండదని.. అదే జగన్ వస్తే మేం చచ్చిపోతామని జేసీ అన్నారు. మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒక చోట లోటు పాట్లు ఉంటాయని, ఎవరిలో తప్పొప్పులు లేవని ప్రశ్నించారు.