జయలలిత నిర్దోషి

 

అన్నాడీఎంకే పార్టీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ‘పురచ్చి తలైవి’ జయలలితపై వున్న అవినీతి ఆరోపణల కేసులో ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. 18 ఏళ్లుగా సాగిన ఈ అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో జయలలిత పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విషయంలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఈ కేసులో జయలలితతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించింది.