జయలలితతో బలవంతంగా సంతకాలు!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లోనే కుప్పకూలిపోయారా! ఆమె స్పృహ కోల్పోయే ముందు బలవంతంగా సంతకాలు తీసుకున్నారా! అంటే అవుననే విధంగా కొన్ని అనుమానాలు బయటపడుతున్నాయి. జయలలిత మరణం గురించి నియమించిన ఆర్ముగస్వామి కమిషన్‌ ముందు ఈ నిజాలు వెలికివచ్చాయి. అమ్మ మరణం గురించి ఒకొక్కరి దగ్గరే వాంగ్మూలాలు స్వీకరిస్తున్న కమీషన్‌ ఈమధ్యనే ఆమె కారు డ్రైవరు కన్నన్‌ను విచారించింది. ఈ విచారణ సందర్భంగా తాను జయలలిత గదిలోకి అడుగుపెట్టేసరికి, ఆమె స్పృహ కోల్పోయి ఉందని కన్నన్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు! ఆ సమయంలో టేబుల్‌ మీద కొన్ని ఫైళ్లు ఉన్నాయనీ, వాటి పక్కనే క్యాప్‌ తీసి ఉంచిన ఓ పెన్ను కూడా ఉందని వెల్లడించాడు. అంతే ఏదో మతలబు జరిగినట్లేగా!