ఒడిశాలో తెలుగు యాత్రికుల బస్సుకు ప్రమాదం..40 మందికి గాయాలు

గుంటూరు నుంచి కాశీకి వెళ్తున్న యాత్రికుల బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కాశీకి వెళ్లేందుకు కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఒడిశాలోని జాజుపూర్ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మందిని కటక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.