కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత...ముగిసిన అంత్యక్రియలు 

మాజీ సిఎం కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూశారు. ఆమె తీవ్ర అనారోగ్య కారణాలతో యశోదా హస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతు శుక్రవారం  అర్దరాత్రి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సకలమ్మ కేసీఆర్ కు ఐదో సోదరి.  ఆమె స్వగ్రామం సిరిసిల్లాజిల్లాలోని ఎల్లారెడ్డిపేటమండలం పెదిరగ్రామం. భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. 
సకలమ్మ మృతి చెందిన వార్త తెలుసుకున్న కేసీఆర్ కంటతడి పెట్టారు. కేసీఆర్, కెటీఆర్ , కవిత, హరీష్ రావ్ ఆమె పార్దీవ దేహాన్ని సందర్శించారు. శనివారం సకలమ్మ అంత్య క్రియలు జరిగాయి.