ఇంతకీ కేసీఆర్ తెలంగాణవాడేనా?

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఏ ప్రాంతానికి చెందనవాడన్న సందేహాలు, వాదనలు వున్నాయి. కేసీఆర్ పూర్వికులు ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చారని అంటారు. అలాగే కేసీఆర్ స్వయంగా అసలు తమ పూర్వికులు బీహార్‌కి చెందినవారని చెప్పారు. ఇదిలా వుంటే, ఇంతకీ కేసీఆర్ తెలంగాణవాడేనా అనే సందేహం తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన అసలు తెలంగాణవాడేనా అనే సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.