డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

అనంతపురంలో గురువారం (జనవరి 9) సాయంత్రం జరగాల్సిన డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించడంతో ఈ ఈవెంట్ ను బాలకృష్ణ రద్దు చేశారు. ఈ విషాద సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 

ఈ ఈవెంట్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరు కావడం, ఎన్నికల తరువాత అనంతపురంలో బాలకృష్ణ సినిమా ఈవెంట్ ఇదే తొలి సారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తారన్న అంచనాలు ఉన్నాయి. డాకూ మహారాజ్ సినిమా ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.