గోడ దూకిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే..

 

ఎట్టకేలకు వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీ ఎంట్రీ ఖరారైంది. గత కొంత కాలంగా అశోక్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు ఆయన టీడీపీలోకి జంపు అవుతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు ఉదయం గిద్దలూరు నుంచి కార్యకర్తలతో కలిసి విజయవాడ బయలుదేరారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్ష్యంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.