ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు
posted on Sep 28, 2015 1:12PM
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై కేసు నమోదైంది. చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు గోదాంల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో టీడీపీనేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన అనుచరులు పోలీసులపై టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో ఎర్రబెల్లితో పాటు ఆయన అనుచరులు 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ ఈ విషయాన్ని తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. యార్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రావాల్సి ఉంది ..కానీ ఆయన రాకముందు ఎర్రబెల్లి శిలాఫలకాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలు దీనిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వివాదం ఏర్పడి టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడనున్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఎర్రబెల్లిపై అతని కార్యకర్తలపై హత్యాయత్నం, దొమ్మి, పోలీసులపై దాడి, కుట్ర కేసులతోపాటు ఇతర కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు.