ఇసుక తుఫాన్.. 19 మంది మృతి

 

రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన ఇసుక తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. 60 మందికి పైగా గాయపడ్డారు. నాగౌర్, జోధ్‌పూర్, జైపర్, ఆల్వార్, భరత్‌పూర్, సవాయ్, మాధోపూర్‌ ప్రాంతాల్లో ఈ ఇసుక తుఫాను సంభవించింది. తుఫాను కారణంగా పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి. భారీ స్థాయిలో వచ్చిన గాలి కారణంగా దాదాపు 50 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఇసుక తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించనున్నామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా ప్రకటించారు.