యాంకర్ పిల్ల ఎగస్ట్రాలు...

 

ఓ యాంకర్ పిల్ల చాలా ఎగస్ట్రాలు చేసింది. మామూలు చానెళ్ళలో యాంకరు పిల్లలు ఎలాంటి ఎగస్ట్రాలు చేసినా పర్లేదుగానీ, ప్రభుత్వానికి చెందిన అధికారిక ఛానల్లో మాత్రం అలాంటివి కుదరవు. యాంకరింగ్ చేసేవాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రైవేటు ఛానళ్ళలో నోరు జారినా పర్లేదుగానీ, దూరదర్శన్‌లో మాత్రం అలా కుదరదు.. పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఆమధ్య చైనా నుంచి జీ (XI) జిన్ పింగ్ అనే పెద్దాయన ఇండియాకి వచ్చినప్పుడు ఓ న్యూస్ రీడర్ పొరపాటు. ‘ఎలెవన్ జిన్ పింగ్’ అని చదివింది. ఆ పాపానికి ఆమె ఉద్యోగం ఊడిపోయింది. దూరదర్శన్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా దూరదర్శన్ తమ యాంకర్లుగా కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని పెట్టుకుంటే బాగుండేది. నవంబర్ 20వ తేదీన గోవాలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కవరేజీ బాధ్యతని ఓ కాంట్రాక్ట్ యాంకరమ్మకి అప్పగించారు. చాలా సీరియస్‌గా చేయాల్సిన యాంకరింగ్‌ని ఆమె ఏదో పిల్లల ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేసినట్టుగా మాట్లాడింది. అంతేకాకుండా ఫిలిం ఫెస్టివల్‌కి వచ్చిన గోవా గవర్నర్‌ మృదులా సిన్హాని ‘గవర్నర్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంది. అక్కడితో ఆగిందా... మహిళా గవర్నర్‌ని ‘అతడు’ అని పేర్కొంది. ఇంకేముంది.. ఇప్పుడీ యాంకరమ్మ వ్యవహారం జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది.