లాకర్లో వంద కోట్ల వజ్రాలు..
posted on Dec 1, 2014 3:40PM
దేశంలో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగమే ఎందుకు కావాలనుకుంటారో పూర్తిగా అర్థమయ్యే సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఈమధ్య యాదవ్ సింగ్ అనే ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి కేసులో అరెస్టయ్యాడు. విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అయ్యగారికి బ్యాంకులో ఉన్న 12 లాకర్లను తెరిచారు. లాకర్లు తెరిచిన వెంటనే ఇన్‌కమ్ టాక్స్ అధికారులకి కళ్ళు తిరిగి పడిపోయినంత పనయింది. అయ్యగారి లాకర్లలో వంద కోట్ల విలువైన వజ్రాలున్నాయి. అక్కడితో అయిపోయిందా.. రెండు కిలోల బంగారం, పది కోట్ల రూపాయల నగదు ఆ లాకర్లలో వున్నాయి. ఇంత సంపద లాకర్లలో దాచిన యాదవ్ సింగ్ గతంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి నమ్మినబంటులా వుండేవాడు. మరి సంపాదించడా?