కేజ్రీవాల్ కు చురక

 

పరిపాలనకు చెందిన ఫైల్స్ లెప్టినెంట్ గవర్నర్ కర్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ స్పందించి కేజ్రీవాల్ కు కొన్ని సూచనలు చేశారు. కేజ్రీవాల్ చట్టాలను గుర్తించాలని, నియమనిబంధనలను పాటించాలని సూచించారు. భారత రాజ్యాంగంలో 1991 యాక్ట్ ప్రకారం వ్యాపార లావాదేవీల నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెందిన ఫైల్స్ అన్నీ కూడా లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లాలి... అలా ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఫైల్స్ కూడా తన కార్యాలయానికి వచ్చి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు, ఆమోదం తెలిపే చట్టాలు గురించి తనకు తెలియాలని అందరు మంత్రులకు, అధికారులకు కూడా ఆ ఆదేశాలు జారీ చేశారు.