ఆ మృత్యు బంతి వేసింది ఇతనే..

 

సిడ్నీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా తలకు బంతి తగలడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూగ్స్ మరణించిన విషయం తెలిసిందే. హ్యూగ్స్‌కి ఆ ప్రమాదకరమైన బంతి వేసిన బౌలర్ పేరు సీన్ అబాట్. తాను విసిరిన బంతి హ్యూగ్స్ తలకు తగిలినప్పటి నుంచి అబాట్ అపరాధ భావంతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు హ్యూగ్స్ మరణించడంతో అబాట్ విలపిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజాలు మాత్రం అబాట్‌ ఈ విషయంలో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, అది అతను తప్పు చేసినట్టు కాదని అంటున్నారు. అనేకమంది ఆస్ట్రేలియన్ టాప్ క్రికెటర్లు ‘‘నువ్వేం తప్పు చేయలేదు’’ అంటూ అబాట్‌కి నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెట్ కమ్యూనిటీ మొత్తం హ్యూగ్స్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూనే సీన్ అబాట్‌కి మద్దతుగా నిలుస్తోంది.