మూడు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే...
posted on Nov 27, 2014 11:37AM
మూడు రోజుల్లో (నవంబర్ 30) తన 26వ పుట్టినరోజును వైభవంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇండియాతో ఆడే టెస్ట్ మ్యాచ్‌లో ఆడాల్సిందిగా తనకు పిలుపు వస్తుందని ఎదురుచూస్తున్నాడు. ప్రాక్టీస్ చేసినట్టుగా వుంటుందని దక్షిణ ఆస్ట్రేలియా - న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నాడు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. సీన్ అబాట్ వేసిన బంతి దూసుకొచ్చి ఫిలిప్ హ్యూగ్స్ ప్రాణం తీసేసింది. హ్యూగ్స్ మరణం విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులే కాదు.. యావత్ క్రీడాభిమానులు విషాదంలో మునిగిపోయారు. పాకిస్థాన్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటను రద్దు చేశారు. త్వరలో ప్రారంభం కావాల్సిన ఇండియా - ఆస్ట్రేలియా మొదటి టెస్టును కూడా వాయిదా వేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.