ప్రత్యేక హెలికాఫ్టర్లో విజయవాడకు కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల చివరి వారాంతంలో ఆయుత చండీయాగం నిర్వహించనున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించడానికి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరారు. కేసీఆర్ తో పాటు బాల్క సుమన్, ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. కాగా చంద్రబాబు కేసీఆర్ కు మధ్యాహ్నం ప్రత్యేక విందు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.