ఏపీలో ఐటీ కంపెనీలకు చంద్రబాబు ఆఫర్లు
posted on Oct 3, 2015 11:55AM
హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమను ఇంతలా అభివృద్ది చేయడానికి ముఖ్యకారణం చంద్రబాబు నాయుడే అని అందరికి తెలిసిన సంగతే. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా ఐటీ పరిశ్రమలో పనిచేసే ఏ ఒక్కరిని అడిగినా అవుననే సమాధానం చెపుతారు. అయితే ఇక్కడ పరిస్థితి ఒకే.. మరి ఏపీలో ఐటీ పరిశ్రమల పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగి కనీసం రాజధాని కూడా రాష్ట్రం.. ఇప్పుడు అన్ని నగరాల మాదిరి ఏపీ రాష్ట్రంలో కూడా ఐటీ రంగం ముందుండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏపీ రాష్ట్రంలో కూడా మిగతా రాష్ట్రాల మాదిరి ప్రోత్సాహాలను ఇస్తే సరిపోదని.. ఏపీకి మరింత ప్రోత్సాహాలు అవసరమని ఐటీ అధిపతులు చంద్రబాబుకు సూచించారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా మరింత ప్రోత్సాహాలను ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అవి..
* కొత్తగా పెట్టబోయే కంపెనీకి 50 శాతం ఫీజు లేదా మూడేళ్లపాటు రీయింబర్స్ చేయడం.
* ఒక్క రూపాయికే యూనిట్ విద్యుత్.. ఐదేళ్లపాటు
* 25 శాతం ఇంటర్నెట్ కనెక్టెవిటీ.. మూడేళ్లపాటు
* విద్యుత్ పన్నుల్లో రాయితీ.. ఐదేళ్లపాటు
* రిజిస్ట్రేషన్.. స్టాంప్ ఫీజుల్లో 50 శాతం రీయింబర్స్ మెంట్
* ప్రాపర్టీ టాక్స్ లోనూ 50 శాతం రీయింబర్స్ మెంట్