లోకేశ్, రేవంత్ కు కీలక పదవులు
posted on Sep 30, 2015 11:06AM
టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల కమిటీలను ప్రకటించారు. ఈసందర్భంగా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి...
* కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్‌లు ఉండనున్నారని తెలుస్తోంది.
* ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది.
* అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం.
* తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకముందు కొనసాగిన ఎల్ రమణనే కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు.
* ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు.