రెండు రాష్ట్రాల్లో ఘనంగా మహాపుష్కరాలు
posted on Jul 14, 2015 10:50AM
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి మహాపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ గోదావరి పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈ పుష్కరాలకు హాజరయ్యారు. గోదావరిలో పుష్కర స్నానం చేసి టీడీపీ తరుపున గోదావరికి చీర, సారెలను సమర్పించారు. చంద్రబాబుతో పాటు పలువురు పీఠాధిపతులు, వేద పండితులు కూడా స్నానం ఆచరించారు. ఈరోజు నుండి ప్రారంభమైన గోదావరి పుష్కరాలు ఈ నెల 25వ తేదీ వరకూ ఉంటాయి. 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను మహా పుష్కరాలు అంటారు. అలాంటి మహా పుష్కరాలు ఇప్పుడు రావడంతో ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ విదేశాల నుండి కూడా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఈ గోదావరి మహాపుష్కరాల కోసం తరలి వస్తున్నారు.