తెలంగాణ నోట్ లోని విశేషాల స్పెషల్..!
posted on Oct 3, 2013 2:02PM

తెలంగాణకు సంబంధించి ఇప్పుడే రాదని అనకున్న తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణపై కేబినెట్ నోట్ ను సిద్ధం చేశారు. సోనియా గాంధీ సూచనల్ని అనుసరించి హోంమంత్రిత్వ శాఖ 22 పేజీల నోట్ ను తయారు చేసింది. నోట్ లో కొన్ని ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించారు. ఆర్టికల్-3 ప్రకారం విభజన జరుగుతుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియ పూర్తవుతుంది.
తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మంది ఉంటారు. అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12. లోక్ సభ స్థానాలు 17 ఉంటాయి. అందులో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యులు 8 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో (సీమాంధ్ర) 175 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. అందులో ఎస్సీలు 29, ఎస్టీలు 7. 25 లోక్ సభ స్థానాల్లో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు కేటాయించాలి. రాజ్యసభ సభ్యలు 10 మంది ఉంటారు. నదీజలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి.