'సినారె' అంత్యక్రియలు నేడే..

 

ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సినారె భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం ఆయన నివాసం నుంచి సారస్వత్‌ పరిషత్‌కు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సినారె భౌతికకాయాన్ని సారస్వత్‌ పరిషత్‌లోనే ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర చేపట్టి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.