లండన్ లో భారీ అగ్ని ప్రమాదం...

 

లండన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ లండన్‌లోని లాన్‌కస్టర్‌వెస్ట్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని లాటిమర్‌ రోడ్‌లో ఉన్న 27 అంతస్తుల అపార్ట్‌మెంట్‌  భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 40 ఫైరింజన్లతో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో మొత్తం 120 ఫ్లాట్స్‌ ఉన్నాయి. జనం నిద్రలో  ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో వందలాది మంది లోపలే చిక్కుకుపోయారని... పలువురు సజీవదహనం అయిపోవడం కళ్లారా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.  ఫైర్‌ సిబ్బంది కూడా అతికష్టం మీద లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu