మీ సెల్‌ఫోనే బ్లడ్ బ్యాంక్!

ఓ చిన్న ఆలోచన మనల్ని పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ సెల్ ఫోన్స్‌లో ఫ్రెండ్స్ పేరుతోపాటు వాళ్ళ బ్లడ్ గ్రూప్‌ని కూడా సేవ్ చేస్తారు. ఎందుకో తెలుసా? బ్లడ్ కావాలంటూ మనకి ఎవరైనా ఫోన్ చేయగానే ఈజీగా మన ఫ్రెండ్స్‌లో ఆ గ్రూప్ బ్లడ్ వున్న వారిని ఐడెంటిఫై చేయొచ్చని.

హెల్త్ ప్రాబ్లమ్స్, ఆపరేషన్స్, యాక్సిడెంట్స్... రీజన్ ఏదైనా బ్లడ్ కావాలంటూ ఎప్పుడైనా, ఎవరైనా మనల్ని అగడవచ్చు. ఆ టైమ్‌లో రైట్ బ్లడ్ గ్రూప్ పర్సన్‌ని ఐడెంటిఫై చేయడానికే చాలా టైమ్ పడుతుంది. ఒక్కోసారి టైమ్‌కి దొరకకపోవచ్చు కూడా. సో, మనదగ్గర ఓ లిస్ట్ వుంటే హెల్ప్‌ఫుల్‌గా వుంటుంది కదా.

ఇంటర్నెట్‌లో మన బ్లడ్ గ్రూప్‌ని రిజిస్టర్ చేసుకునే వెబ్‌సైట్స్ కొన్ని వున్నాయి. వాటిలో రిజిస్టర్ చేసుకుంటే మన బ్లడ్ గ్రూప్ అవసరమైనప్పుడు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆ సైట్స్ వివరాలు కనిపిస్తాయి. వీలయితే అందులో పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఎప్పుడు, ఎవరికి బ్లడ్ అవసరం అవుతోందో తెలీదు. ఆ టైమ్‌లో అత్యవసరం అన్నప్పుడు ఎంతో టెన్షన్‌గా అనిపిస్తుంది. ఆ టెన్షన్‌ని కాస్త తగ్గించే చిన్న ప్రయత్నం... మీ ఫోన్ లిస్ట్‌లో పేరుతోపాటు వారి బ్లడ్ గ్రూప్‌ని కూడా అడిగి సేవ్ చేయడం...

-రమ