చంద్రబాబుపై బిల్‌గేట్స్‌ ప్రశంసలు...చాలా సంతోషంగా ఉంది...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. గత ఏడాది నవంబరులో విశాఖపట్నంలో నిర్వహించిన అగ్రిటెక్‌ సమ్మిట్‌-2017కు బిల్ గేట్స్ హాజరైన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆయన చంద్రబాబును పొగుడుతూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని... అగ్రిటెక్‌ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే రోజు ఇంకెంతో దూరంలో లేదని, చంద్రబాబునాయుడుతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అగ్రిటెక్‌ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందని... భూసార పరీక్షల మ్యాపింగ్‌తో పాటు వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆరోగ్యరంగంలో చేపడుతున్న సంస్కరణలు, పొరుగు సేవల విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కితాబిచ్చారు. అధికశాతం ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ భారత్‌లోనే ముందంజలో ఉన్న విషయాన్ని తెలుసుకున్నానన్నారు. మొత్తానికి చంద్రబాబును పొగుడుతూ బిల్ గేట్స్ లేఖ రాయడం గ్రేటే...