ఏపీ ఎన్నికల ప్రచారానికి నాని.. వైసీపీకి టిట్ ఫర్ టాట్!

గదిలో బంధించి కొడితే పిల్లి కూడా  పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నానిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

ఎందుకంటే.. గతంలో జగన్ సర్కార్ సినిమా టికెట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన కారణంతో నానిని జగన్ సర్కార్ నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించంది. సినీ పరిశ్రమ మేలు కోసం అంటూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు, సర్కార్ నిర్ణయం సినీ పరిశ్రమకు మేలు కాదు కీడు చేస్తుందంటూ చెప్పినందుకు  నానిపై పలువురు వైసీపీ నాయకులు నానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాని స్థాయి ఏమిటంటూ నిలదీశారు.  అంతే కాకుండా అప్పట్లో ఆయన సినిమా శ్యాం సింగరాయ్ విడుదల సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు. అప్పటికి మౌనంగా ఉన్న నాని..నానిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని ఆయనను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీకి ఇప్పుడు నాని సరైన బదులిచ్చినట్లైంది.

ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట, అదీ వైసీపీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న వేళ నాని తన గళం విప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమన్న సంకేతం ఇస్తూ తన ప్రచారానికి తానే బెస్టాఫ్ లక్ చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు.  దీంతో నాని నాడు వైసీపీ తనను వేధించిన తీరుకు టిట్ ఫర్ టాట్ అన్న చందంగా రిటార్డ్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సనిమా శ్యాం సింగరాయ్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు ఇప్పుడు సరైన బదులిచ్చినట్లైందని అంటున్నారు.