బీఫ్ వివాదం... పద్మభూషణ్ వెనక్కి...
posted on Oct 29, 2015 2:58PM
బీఫ్ వివాదంపై దేశవ్యాప్తంగా ఇంకా తీవ్ర నిరసలు వ్యక్తమవుతూనే ఉన్నాయి, ఇప్పటికే పలువురు రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయగా మరికొందరు అదే దారిలో నడుస్తున్నారు, తాజాగా ప్రముఖ సైంటిస్ట్ పీఎం భార్గవ... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ ను వెనక్కి ఇచ్చేయాలని డిసైడయ్యారు, ప్రజలు ఏం తినాలో... ఏం తినకూడదో ప్రభుత్వమే చెబుతుందా అంటూ ప్రశ్నించిన పీఎం భార్గవ... ప్రజలు ఏం చేయాలన్నదానిపై రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు, బీఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చలేదన్న పీఎం భార్గవ... నిరసనగా పద్మభూషణ్ ను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నానన్నారు. ఇప్పటికే వందమందికి పైగా రచయితలు... సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేయగా, ఇప్పుడు సైంటిస్ట్ పీఎం భార్గవ చర్యతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.