గుంటూరులో వైఎస్ఆర్ సిపి గూండాల దాడి 

అధికారం కోల్పోయినప్పటికీ వైఎస్సార్ సీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. టపాసులు పడ్డాయన్న సాకుతో ఓ దళిత కుటుంబంపై దాడులకుపాల్పడ్డారు. ఇంటిని ధ్వంసం చేశారు. 
 అధికారం కోల్పోయినా వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. దీపావళి టపాసులు తమ ఇంటి ముందు పడ్డాయని ఓ దళిత కుటుంబంపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి తెగబడ్డారు. 
గుంటూరు శివారు రెడ్డిపాలెంలో ఈ దారుణకాండ చోటు చేసుకుంది. అవినాశ్ కుటుంబంపై నరేంద్రరెడ్డి ముఠా దౌర్జన్యం చేసింది. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.