మే 14న ఏపియస్ ఆర్టీసి విభజన

 

దాదాపు 11 నెలల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. కానీ నేటికీ ఏపియస్.ఆర్టీసి సంస్థ ఉమ్మడి పాలనలోనే నడుస్తోంది. ఆర్టీసి విభజన ప్రక్రియ కూడా ఒక కొలిక్కి రావడంతో వచ్చే నెల 14నుండి ఆంద్ర, తెలంగాణా ఆర్టీసీలు వేర్వేరుగా నిర్వహించేందుకు ఏపియస్.ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ యన్. సాంబశివరావు నిన్న ఉత్తర్వులు జారీ చేసారు. మే14నుండి ఆంద్ర, తెలంగాణా ఆర్టీసీలు వేర్వేరు కార్పోరేషన్లుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. హైదరాబాద్ లో గల ఆర్టీసీ భవన్ లో ‘ఏ’ బ్లాకును ఏపియస్.ఆర్టీసికి, ‘బి’ బ్లాకును తెలంగాణా స్టేట్ ఆర్టీసికి కేటాయించారు. రెండు సంస్థలు మే 14నుండి రెండు సంస్థలు వేర్వేరుగా రికార్డులు నిర్వహించుకొంటాయి. కానీ రెండు కార్పోరేషన్ల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు ఇంకా పూర్తికావలసి ఉంది. ప్రస్తుతం ఆర్టీసిలో 1.19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 61 వేల మంది ఉద్యోగులను, తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 58వేల మంది ఉద్యోగులను దశల వారిగా కేటాయించబడ్డారు. అదేవిధంగా ఏపియస్.ఆర్టీసికి 404 ఉన్నతాధికారులను, తెలంగాణా ఆర్టీసీకి 197మందిని కేటాయించారు.