మరికొద్ది సేపటిలో ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
posted on May 21, 2015 9:31AM
కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఈరోజు ప్రకటించబోతున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జే.యాన్.టి.యు.లో ఇంజనీరింగ్, మెడికల్ మరియు అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలను (ర్యాంకులు) ప్రకటిస్తారు. పరీక్షలు వ్రాసిన విద్యార్ధులందరికీ పరీక్షా ఫలితాలను వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్ ల ద్వారా తెలియజేయబడుతుంది.
పరీక్షా ఫలితాలు ప్రకటించిన తరువాత మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఉదయలక్ష్మి ఇతర అధికారులతో సమావేశమవుతారు. కనుక ఈరోజే ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహించబోయేది కూడా ప్రకటించవచ్చును. జూన్ 12లేదా 15వ తేదీల నుండి కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.