దొంగే దొంగ అన్నట్టు ఉంది.. చంద్రబాబు

రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీని దెబ్బతీయడానికే టీఆర్ఎస్ తెదేపాపై కుట్ర పన్నిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని అందుకే టీఆర్ఎస్ టీడీపీని టార్గెట్ చేసిందని అన్నారు. అసలు టీఆర్ఎస్ లో 63 మంది ఎమ్మెల్యేలు ఉండగా 5 మందిని ఎమ్మెల్సీల బరిలో ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవహారం ఒక దొంగే.. దొంగా.. దొంగా అన్నట్టు ఉందని విమర్శించారు.