నేడే ఏపీ డీయస్సీ ఫలితాలు ప్రకటన

 

ఈరోజు సాయంత్రం ఏపీ డీయస్సీ ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5.30గంటలకి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో ఫలితాలను విడుదల చేయబోతున్నారు. గత నెల ప్రకటించిన తుది ‘కీ’ పై చాలా అభ్యంతరాలు రావడంతో తప్పులను సవరించి మళ్ళీ నిన్న సాయంత్రం మరొకమారు ‘కీ’ ప్రకటించారు. ఈనెల 12న తిరిగి పాటశాలలు తెరిచేలోగా డీయస్సీలో ఉత్తీర్ణులయిన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.