అమర్‌నాథ్ యాత్రలో మరో ఘోర విషాదం

పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. రాంబాణ్ జిల్లాలోని నాచ్‌నల్లా వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడి 16 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ల సాయంతో ఆస్పత్రికి తరలించారు..వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత వారం అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే.