కుప్పకూలిన అబ్దుల్ కలాం

 

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అస్వస్థతకు గురయ్యారు. ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన తాను ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ఆయన ప్రసంగ కార్యక్రమం జరుగుతూ వుండగా ఆయన మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.